మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకంలో పని చేస్తున్న వేతనదారుల చెల్లింపుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.685.12 కోట్లు మంజూరు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గడిచిన నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్లు విడుదల అయ్యాయన్నారు. ఈ మొత్తంలో గడిచిన రెండు రోజుల్లో రూ. 302.96 కోట్లు వేతనదారుల ఖాతాలకు నేరుగా జమ చేశామని తెలిపారు. మిగిలిన రూ.319 కోట్లు వచ్చే రెండు మూడు రోజుల్లో వేతనదారుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి