విజయవాడలో జనసేన, తెదేపాకు చెందిన పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కన్నా... ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని వ్యాఖ్యానించారు. భాజపా మాత్రమే నిజమైన ప్రజాస్వామ్య పాలన అందిస్తుందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
భవన నిర్మాణ కార్మికులతో భిక్షాటన
ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ...రేపు విజయవాడ లెనిన్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నా స్పష్టం చేశారు. నాలుగు నెలలుగా ఇసుక లేని కారణంగా లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించని కారణంగా రేపు భిక్షాటన చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీచదవండి