కరోనా వల్ల తగ్గిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని పెంచుకోవడంపై అధికారులు కసరత్తు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు సమాచార మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, ఆదాయ నష్టానికి అడ్డుకట్ట వేసే మార్గాలపై ఓ కార్యాచరణ రూపొందించారు. ఇందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌లతో జీఎస్టీ ఆదాయానికి గండి కొడుతున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లయిమ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు మరింత నిఘా పెంచాలని నిర్ణయించారు.
ఇందుకోసం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని చర్యలు చేపట్టాలని అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చారు. జీఎస్టీ వసూళ్లలో లోపాలు లేకుండా మరింత సమర్ధంగా పనిచేసేందుకు.. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయం ఎంతో కీలకం. జీఎస్టీ వసూళ్లలో కేంద్ర, రాష్ట్ర అధికారులు తీసుకునే నిర్ణయాలు, చర్యల విషయంలో సారూపత్యత ఉండేలా కార్యాచరణ రూపొందించారు. వార్షిక టర్నోవర్ 5కోట్ల రూపాయలు దాటినా.. పన్ను చెల్లించని వారికి కళ్లెం వేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి:
RRR movie: ఆర్ఆర్ఆర్ ట్రీట్.. 'దోస్తీ' సాంగ్ వచ్చేసింది