తమ పాఠశాలలకు ప్రభుత్వం అందించే సాయం కొనసాగించాలని ఆర్‌సీఎం పాఠశాలల(rcm schools) యాజమాన్యం పాఠశాల విద్యా కమిషనరేట్‌కు లేఖ రాసింది. ఎయిడెడ్ పాఠశాలల విలీనం ప్రక్రియలో భాగంగా అధికారులు ఇచ్చిన ఆదేశాలపై గ్రాంటు ఇన్ ఎయిడ్, సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతిస్తూ ఆర్‌సీఎం ఇటీవల లేఖలు అందించింది. ఇప్పుడు సిబ్బందిని వెనక్కి ఇవ్వడంతోపాటు ప్రభుత్వ ఆర్థిక సాయం కొనసాగించాలని కోరుతూ లేఖ రాసింది. ఒత్తిడిలో తొలుత ప్రభుత్వానికి అప్పగించామని, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కలిపి 34, గుంటూరులో 60, కృష్ణాలో 90వరకు ఈ సంస్థకు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఇచ్చేందుకు సమ్మతి తెలపని ఎయిడెడ్ విద్యా సంస్థలకు సాయం కొనసాగించాలని, సిబ్బందికి జీతాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సమ్మతి లేఖలు సమర్పించిన పలు ఎయిడెడ్ యాజమాన్యాలు వాటిని వెనక్కి తీసుకునేందుకు సమాయత్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: Power Crisis: రాష్ట్రంలో విద్యుత్ కొరత... పరిశ్రమలకు సరఫరాలో కోత!