RBI on AP Branch: ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో తేల్చాకే ఇక్కడ తమ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని భారత రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటినా ఇంకా.. ఏపీలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంపై అఖిల భారత పంచాయతి పరిషత్ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గతేడాది అక్టోబర్ నెలలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
దీనిపై సమాధానం ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి లేఖ వెళ్లింది. ఏపీలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిన ఆర్బీఐ అధికారులు.. ముందు రాజధాని ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని సమాధానమిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్బీఐ నుంచి ఏపీకి అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నట్లు లేఖలో వివరించారు. రాజధాని విషయంపై స్పష్టత వచ్చాక తప్పనిసరిగా కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ అధికారులు తనకు పంపిన లేఖలో పేర్కొన్నట్లు జాస్తి వీరాంజనేయులు తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి..Service Sector in Andhra Pradesh: రాష్ట్రంలో.. తిరోగమనంలో సేవల రంగం