నిత్యావసర సరకులు ప్రజలకు ఇచ్చేందుకు 6.7 వర్షన్ తో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ అశోక్ నగర్ లోని సివిల్ సప్లై కార్యాలయం ముందు రేషన్ డీలర్లు నిరసన చేపట్టారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని.. కరోనాతో 30 మంది రేషన్ డీలర్లు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన రేషన్ డీలర్లకు ఎక్సగ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. తమకు గౌరవ వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: జై అమరావతి’ నినాదాలతో హోరెత్తిన రాజధాని శంకుస్థాపన ప్రాంతం