ETV Bharat / city

రక్షాబంధన్​తో ప్రకృతి బంధం

రాఖీ వేడుక మానవ జీవితాల్లో పెనవేసుకున్న ఓ బంధం. చేతికి రాఖీ కట్టి... నోట్లో మిఠాయి పెట్టి... నుదుటున బొట్టు పెట్టి... తోబుట్టువు సంతోషంగా ఉండాలంటూ హారతి ఇచ్చిన వారికి బహుమతి ఇవ్వడం పరిపాటి.  మనతో ఉన్న అతివలకు భద్రత ఇచ్చేందుకు మనమున్నాం... కానీ అందరి బాగు కోరుకునే ప్రకృతి బాగోగులు పట్టించుకునేవారెవ్వరు..? నిస్వార్థంగా ఊపిరినందించే చెట్లకు భద్రతగా ఎవరున్నారు..? కానీ ఈసారి బహుమతికి  బదులుగా ఓ మొక్కను ఇచ్చి రాఖీ బంధాన్ని ప్రకృతితో ముడిపెడదాం.

రక్షాబంధన్​తో ప్రకృతి బంధం
author img

By

Published : Aug 15, 2019, 10:31 AM IST

రక్షాబంధన్​తో ప్రకృతి బంధం

ప్రాంతాల వారీగా సంస్కృతి, సంప్రదాయాన్ని బట్టి ఎన్ని పండుగలున్నా మనుషుల మధ్య ఒకరికొకరు తోడున్నామంటూ గుర్తుచేసుకునే పండుగ రక్షాబంథన్​. తనకు రక్షణగా ఉండమంటూ సోదరి చేతికి కట్టిన రాఖీని చూస్తే...వారిపట్ల మన బాధ్యతను గుర్తుకు తెస్తుంది. ఆ రాఖీలు కొంతకాలానికి పాతవైపోయాక తీసేస్తాం. అలా కాకుండా బంధం శాశ్వతంగా ఉండేలా, ప్రకృతికీ సాయపడేందుకు ఈసారి ఓ మంచి బహుమతి ఇద్దాం..

రాఖీ కట్టండి... బాధ్యత అప్పగించండి

రాఖీ కట్టినప్పుడు ఓ మొక్కను బహుమతిగా ఇద్దాం... మనపై చూపించే ప్రేమ, ఆప్యాయతలో కొంచెం ఆ మొక్కపై పెట్టమని చెబుదాం.. మొక్కగా మొదలైన బంధం వేళ్లూనుకుని దృఢమైన మానులా మారేవరకు కాపాడమని అడుగుదాం. ఇలా చేస్తే మనవాళ్లు ఏ వయస్సులో ఏ స్థాయిలో ఉన్నా ఆ చెట్టును చూడగానే మన తలంపుకి వచ్చేలా గుర్తుచేసినవారమవుతాం.

ప్రకృతికి భద్రతనిద్దాం...

మన అనుకున్నవాళ్లకు భద్రతనిచ్చేందుకు మనమున్నాం... కానీ మాననాళికే బతుకునిస్తున్న వృక్షాల భద్రతకు ఎవరున్నారు. విశ్వంతో మమేకమై ప్రయాణం సాగించే ఈ ప్రకృతిని... ఎవరు పట్టించుకోకుంటే ఎలా...?. తరాల నాటి సంపద మన తదుపరి తరాలకు అందించే బాధ్యత మనమంతా తీసుకోవాలి. అంతటి మంచి కార్యానికి రాఖీ పండుగనే వేదిక చేసుకుందాం.

బంధాన్ని శాశ్వతంగా నిలుపుకుందాం...

రక్త సంబంధం ఆ కుటుంబానికే పరిమితం. అక్కా తమ్ముడు, చెల్లి, అన్న, అమ్మ, నాన్న ఇలా ఒకరి బాధ్యత, భద్రత ఒకరు చూసుకుంటారు, పంచుకుంటారు. కానీ రక్షాబంధం విశ్వవ్యాప్తమైనది. జగమంత కుటుంబం దానిది. దానిని ప్రకృతితో ముడిపెడుతూ ఈ ఏడు జరుపుకునే రాఖీ పండుగను శాశ్వతంగా మిగిలిపోయేలా చేసుకుందాం... ఎందుకంటే బంధాలు శాశ్వతమైనవి... బహుమతులు పరిమితమైనవి. ఈసారి బహుమతినీ కలకాలం నిలిచిపోయేలా చేద్దాం.

ఇదీ చూడండి: 'ఆర్టికల్​ 370ని శాశ్వతం ఎందుకు చేయలేదు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.