ETV Bharat / city

జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన రేషన్: కొడాలి నాని

కరోనా కారణంగా పేదలకు ఇస్తోన్న ఉచిత బియ్యం పథకాన్ని ఫిబ్రవరి వరకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు.. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు. రాష్ట్రంలో రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Quality ration door to door from January 1st says Kodali Nani
కొడాలి నాని
author img

By

Published : Nov 29, 2020, 11:20 PM IST

కొడాలి నాని

జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన రేషన్ పంపిణీ ప్రారంభమవుతుందని... అప్పటి నుంచి రేషన్ దుకాణాలన్నీ స్టాక్ పాయింట్లుగా మారతాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కొత్త వ్యవస్థను విజయవంతం చేసేందుకు రేషన్ డీలర్లు అందరూ సహకరించాలని కోరారు. విజయవాడలో జరిగిన కృష్ణా జిల్లా చౌక ధరల దుకాణాదారుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు.

రైతులకు విత్తనాలు, ఎరువులు సహా ఇతర వస్తువులు రేషన్ డీలర్ల ద్వారా ఇవ్వాలనే ఉద్దేశం ముఖ్యమంత్రికి ఉందని కొడాలి నాని వివరించారు. కరోనా వచ్చాక కేంద్రం ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తున్నందునా.. డీలర్లకు కమీషన్ రావడంలేదని మంత్రి తెలిపారు. డీలర్లకు కేంద్రం 35 పైసల చొప్పున కమీషన్ ఇస్తామంటోందని... రూపాయి కమిషన్ ఇవ్వాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు.

డీలర్లకు ఇచ్చే కమీషన్ భారం రూ.270 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై పడిందని... కేంద్రం కమీషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా డీలర్లకు రావల్సిన కమీషన్​ను రాష్ట్ర ప్రభుత్వమే త్వరలో ఇస్తుందని స్పష్టం చేశారు. కరోనాతో చనిపోయిన 17 మంది రేషన్ డీలర్లకు పరిహారం ఇచ్చే అంశం పరిశీలిస్తామన్నారు. డీలర్లు గన్నీ బ్యాగ్​లు వెనక్కి ఇవ్వడం ద్వారా కోల్పోయే ఆదాయాన్ని ఎలా వచ్చేలా చేయాలో చర్చిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండీ... ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.