సీఎం జగన్ సొంత జిల్లాలో జరిగిన పేలుడుపై.. ఆయన ఏం సమాధానం చెప్తారని తెదేపా సీనియర్ నేత పుట్టా సుధాకర్ యాదవ్ నిలదీశారు.
మామిళ్లపల్లి వైకాపా నేతల క్వారీలో జరిగిన పేలుళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.క్వారీని మూసేశామని స.హ.చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానమిచ్చింది. మూతపడిన క్వారీలో పేలుళ్లు ఎలా జరిగాయి. మందుగుండు సామగ్రి ఎక్కడి నుంచి, ఎవరి ద్వారా క్వారీకి వస్తోంది. అధికారపార్టీ నేతల క్వారీ కాబట్టి ప్రభుత్వం స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
-పుట్టా సుధాకర్ యాదవ్
ఇదీ చదవండి: