రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న ఘటనలను పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకరభారతి స్వామి ఖండించారు. విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆవేశపూరితమైన, హృదయ విదారకరమైనవిగా స్వామి అభివర్ణించారు. ఈ తరహా ఘటనలపై ప్రభుత్వం స్పందించి కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రతి హిందువులో చైతన్యం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రామస్వామి విగ్రహం ధ్వంసం చేసిన తరువాత మరొక విగ్రహాన్ని పెట్టవచ్చన్న వాదన బాధాకరమని వ్యాఖ్యానించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్రను తిరిగి తీసుకురాగలరా అని ప్రశ్నించారు. భవిష్యత్తు తరానికి ఈ తరహా ఘటనలు మంచివి కాదని.. పురాణాలే భారత దేశానికి పునాధులని వివరించారు. ఏ ఉద్దేశ్యంతో ఈ ఘటనలు జరుగుతున్నాయో తెలుసుకుని వాటి మూలాలను తుంచివేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: