రెండు రోజుల కిందట విజయవాడ కృష్ణానదిలో దూకి గల్లంతైన మానసిక వైద్యుడు శ్రీనివాస్ ఆచూకీ ఇంకా లభించలేదు. శ్రీనివాస్ ఆచూకీ కోసం రెండు ప్రత్యేక ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలతో పాటు అవనిగడ్డ, ఏలూరు ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వైద్యునిగా పనిచేస్తున్న డా. శ్రీనివాస్ ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ మృతదేహాలను తీసుకెళ్లే అంబులెన్సులకు నిర్ణీత ఛార్జీలు