రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోతోందని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల స్పందన లేకుంటే మరో ఉద్యమం తప్పదని ఏపీ ఉద్యోగ సంఘాల ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో ఆదివారం జరిగిన నంద్యాల డివిజన్ ఐకాస నాయకుడు బీసీ హుసేన్‌రెడ్డి కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు. అంతకుముందు ఆయన శ్రీకామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఐదేళ్లకోసారి పీఆర్‌సీ ఇస్తామన్న జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండు చేశారు.
ఇదీ చదవండి: