ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో చేపట్టిన నిరసన దీక్ష రెండో రోజుకు చేరింది. దీక్షా శిబిరాన్ని పలువురు రాజకీయ నాయకులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చాక వెనుకబడిన వర్గాల ప్రజలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని మండిపడ్డారు.
మళ్లించిన సబ్‌ప్లాన్ నిధులను వచ్చే బడ్జెట్లో తిరిగి జమ చేసి, రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పేందుకు బడుగు బలహీన వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఇదీ చదవండి