ETV Bharat / city

గంటల తరబడి ఫోన్లు.. పిల్లల్లో మానసిక సమస్యలు.. నిపుణులేమంటున్నారు? - vijayawada latest news

కొవిడ్ కారణంగా విద్యార్ధులకు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. గంటల కొద్ది ఫోన్ చూస్తున్న విద్యార్థులు క్రమంగా వాటికి బానిసలవుతున్నారు. వద్దని తల్లిదండ్రులు మందలిస్తే.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు నగరంలో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల వద్దకు వచ్చే ప్రతి పది మందిలో ఎనిమిది కేసులు ఇలాంటివే ఉంటున్నాయి. టెక్నాలజీ సరైన రీతిలో వాడకపోతే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Problems arising in children due to the use of phones
phone
author img

By

Published : Aug 27, 2021, 12:34 PM IST

మా అబ్బాయి చదువుల్లో చాలా చురుగ్గా ఉంటాడు... ఏడాది నుంచి ఫోన్‌ ఎక్కువ చూస్తున్నాడు... ఒంటరిగా ఉంటూ.. అందులో గేమ్స్‌ ఆడుతున్నాడు. ఇంట్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదు.

డాక్టర్‌ గారు.. మా అమ్మాయికి చదువుపై ఏకాగ్రత ఉండడం లేదు. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నా దృష్టి పెట్టడం లేదు. ఎప్పుడూ ఏదొక యాప్‌తో కాలక్షేపం చేస్తోంది.

విజయవాడ నగరంలో సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల వద్దకు వచ్చే ప్రతి పది మందిలో ఎనిమిది కేసులు ఇలాంటివే ఉంటున్నాయి. గతంలో వారాంతంలోనే ఫోన్‌ను ముట్టుకునేవారు. కొవిడ్‌ కారణంగా పరిస్థితుల్లో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. ఆన్‌లైన్‌ క్లాసుల కారణంగా వీటితో సహవాసం తప్పనిసరి అయింది. దీంతో తెలియకుండానే మొబైళ్లకు బానిసలవుతున్నారు. గట్టిగా మందలిస్తే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

వద్దన్నా వినడం లేదు..

  • నిత్యం ఫోన్‌లో ఆటలాడుతోందని తల్లి మందలించడంతో ఇటీవల కంచికచర్లలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తనువు చాలించింది. తల్లి నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని మృతి చెందింది.
  • కైకలూరు మండలం పల్లెవాడకు చెందిన బాలిక, తన తండ్రి ఫోన్‌ను ఆన్‌లైన్‌ తరగతులకు ఉపయోగిస్తోంది. మిగిలిన సమయంలో ఫోన్‌ ఎక్కువ చూడొద్దని గట్టిగా చెప్పారని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో టీలో ఎలుకల మందు కలుపుకుని తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
  • తొమ్మిదో తరగతి చదువుతున్న విజయవాడ బాలుడు, క్లాసులో టాపర్‌. ఏడాది నుంచి పాఠశాలలు లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నాడు. ఖాళీ సమయంలో కాలక్షేపం కోసం సరదాగా ఫోన్‌లో ఆట మొదలుపెట్టాడు. క్రమంగా దీనికి బానిసయ్యాడు. ఉత్సుకతతో ఒక్కో లెవల్‌ పెంచుతూ రోజుకు 8 గంటలు ఆడే వరకు వెళ్లింది. మిగిలిన సమయంలోనూ ఆటపైనే ధ్యాస. ఏకాగ్రత కోల్పోయాడు. తల్లిదండ్రులు వద్దని చెబుతున్నా వినడం లేదు. రాత్రి సమయాల్లోనూ నిద్రపోకుండా చాటుగా సెల్‌లో ఆటలాడుతున్నాడు. దీంతో పరిస్థితి చేయి దాటుతోందని భావించి, మానసిక శాస్త్రవేత్త వద్దకు తీసుకెళ్లారు.

మానసికంగా తీవ్ర ప్రభావం..

చేతిలో మొబైల్‌ లేనిదే నిద్ర పట్టని పరిస్థితి. దీంతో మానసికంగా అనేక సమస్యలను కొనితెచ్చుకున్నారు. విచ్చలవిడి వాడకం కారణంగా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. పిల్లలపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుండడం, నిద్రకు దూరమవడం వంటికి ప్రధానంగా కనిపిస్తున్నాయని మానసిక వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడంతో మొండితనం, చిరాకు, అసహనం, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. ఏకాగ్రత కొరవడి చదువు దెబ్బతింటోంది.

తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి

మొబైల్‌ వినియోగాన్ని కట్టడి చేసి, అవసరానికి తగ్గట్లు వాడుకుంటే చక్కని ఫలితాలు సాధించవచ్చని పిల్లలకు తల్లిదండ్రులు వివరించి చెప్పాలి. ఈ విషయంలో పెద్దలే బాధ్యత తీసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు వారి ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల్లో తలమునకలై ఉంటున్నారు. ఫలితంగా పిల్లలపై పర్యవేక్షణ తగ్గుతోంది. తరచూ పిల్లలను గమనిస్తూ ఉండాలి. ఆన్‌లైన్‌ క్లాసుల తర్వాత చరవాణికి దూరంగా ఉండేలా చూడాలి. ఇలా రోజూ నియంత్రణ విధిస్తే మారే అవకాశాలు ఉన్నాయి.

  • చిన్నారుల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలి. కథలు చదవడం, పజిల్స్‌ పూర్తి చేయడం, ఆటలాడుకోవడం, తదితర వాటి వల్ల చాలా మార్పు కనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించాలి. వారితో కూర్చుని సరదాగా కబుర్లు చెబుతూ ఉంటే వారిని చరవాణి నుంచి కొంత వరకు దూరం చేయవచ్ఛు పెద్దలే ఎక్కువగా టీవీలకు అతుక్కుపోతే, వారిని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు.
  • మొదట్లోనే మానసిక సమస్యలకు అడ్డుకట్ట వేయకపోవతే, భవిష్యత్తులో మరింత కుంగుబాటుకు గురై నేరాల బాట పట్టే అవకాశం ఉంది. మత్తుపదార్థాలకు బానిసలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వారిలోని ప్రతిభను గుర్తించి, అందులో నైపుణ్యం సాధించేందుకు దృష్టి పెట్టాలి. నిత్యం ఏదొక వ్యాపకంలో బిజీగా ఉండేలా చూడాలి. డిజిటల్‌ సమయాన్ని వీలైనంత వరకు తగ్గిస్తే, ఖాళీ సమయాన్ని ఉపయోగకరమైన వాటికి వెచ్చించే అవకాశం ఉంది.

అవసరానికి మించి వద్దు

పిల్లల్లో తలెత్తుతున్న మానసిక సమస్యలు... నిపుణుల మాటేమిటి ?

డిజిటల్‌ పరికరాల వినియోగం రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. సద్వినియోగం చేసుకుంటే మేలు కలుగుతుంది. లేనిపక్షంలో దుష్ఫలితాలు తప్పవు. తల్లిదండ్రులే తొలి గురువులు కాబట్టి జాగురూకతతో వ్యవహరించాలి. పిల్లలు ఒకసారి హింసాత్మక, అశ్లీలతకు అలవాటు పడితే కష్టమే. ఏది మంచి, ఏది చెడు వంటిది తల్లిదండ్రులు చెప్పాలి. అవసరానికి మించి వాడకం వల్ల వారిలో సహజమైన మేథో వికాసానికి ప్రతిబంధకంగా మారుతుంది. - మానస, మానసిక వ్యాధుల నిపుణులు విజయవాడ

ఇదీ చదవండి

జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2020: దాచుకున్న సొమ్ము.. దవాఖానాల పాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.