ETV Bharat / city

పల్లె పోరు: అభ్యర్థులపై రాజకీయ పక్షాల ఒత్తిళ్లు

‘నీవు పోటీలో ఉంటే ఎలా లేదన్నా కనీసం రూ.10లక్షలు ఖర్చు అవుతాయి. గెలుస్తావో లేదో నీకే నమ్మకం లేదు.. అలాంటప్పుడు పోటీ ఎందుకు..? మాకు సహకరించు.. నీకేం కావాలో అడుగు..’ ఇదీ ప్రస్తుతం తొలి దశ పంచాయతీల్లో ఓ పార్టీ జరుపుతున్న రాయబారం. ఎక్కువ గ్రామాల్లో అంతర్గత చర్చలు ప్రారంభం అయ్యాయి. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు కమిటీలే బయలుదేరాయి. నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. మరోవైపు ఓడినా ఫరవాలేదు.. తక్కువ ఓట్లు వచ్చినా ఏంకాదు.. మీ వెనుక ఉన్నాం.. పోటీలోనే ఉండు..’ అంటూ మరో పార్టీ ఒత్తిడి. దీంతో గ్రామాల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే తొలిదశ పోరులో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా నాలుగో తేదీ వరకు నామపత్రాలు ఉపసంహరణ వరకు గడువు ఉంది. దీంతో ఏకగ్రీవం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలోని ఒక పంచాయతీలో నామినేషన్‌ను అడ్డుకున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. దీనిపై పరిశీలన జరుగుతోంది.

Pressures of political parties on candidates
అభ్యర్థులపై రాజకీయ పక్షాల ఒత్తిళ్లు
author img

By

Published : Feb 3, 2021, 2:10 PM IST

తొలివిడతలో విజయవాడ డివిజనులోని 234 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 13న పోలింగ్‌ జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడతాయి. గుర్తులు వచ్చిన తర్వాతే అభ్యర్ధుల ప్రచారం సాగుతుంది. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో పత్రాలపై గుర్తులు తప్ఫ.. పేర్లు ఉండవు. దీంతో ప్రస్తుతం ప్రచారం సాగడం లేదు. కానీ నామినేషన్ల ఉపసంహరణకు ఏకగ్రీవాలకు పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలైనా.. రాజకీయ పార్టీలదే పైచేయిగా ఉంది. ఇప్పటికే కొన్ని పంచాయతీలు సర్దుబాటు చేసుకున్నారు. మైలవరం, నందిగామ, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.

* నందిగామ నియోజకవర్గంలో కేతవీరునిపాడు పంచాయతీ ఏకగ్రీవం చేశారు. వైకాపా సానుభూతిపరులకు దక్కింది. ఉపసర్పంచ్‌ తెదేపాకు కేటాయించనున్నారు. నందిగామ మండలంలో 39 వార్డులు ఏకగ్రీవం అయినట్లే. వీరులపాడు మండలంలో గోకరాజుపల్లి, చట్టన్నవరం ఏకగ్రీవాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంచికచర్ల మేజరు గ్రామ పంచాయతీలో తెదేపా మధ్య పోటీ ఎక్కువైంది. చందర్లపాడు మండలం బొబ్బిళ్లపాడు, నందిగామలో మాగల్లు పంచాయతీలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

* ఇక్కడ పంచాయతీలకు మండలస్థాయి నేతలతో కమిటీ, పరిశీలకుల కమిటీ నియోజకవర్గ స్థాయి నేతలతో ఏర్పాటు చేసి సంప్రదింపులకు సర్దుబాటులకు వైకాపా నేతలు ప్రయత్నాలు చేయడం విశేషం. సామరస్యంగా పరిష్కారం చేసుకునేందుకు గ్రామ స్థాయిలో చర్చలు చేస్తున్నారు.● గన్నవరం నియోజకవర్గం పరిధిలో ప్రసాదంపాడు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఇందుకోసం కృషి చేస్తుండగా సొంత పార్టీలోని ఇతర వర్గాల నేతలు సహకరించడం లేదనే వాదన ఉంది. నున్నలో వైకాపాలో పోరు ఉంది. ఎనికేపాడులో తెదేపా సానుభూతిపరుని నామినేషన్‌ చెల్లుబాటు కాకపోవడం వివాదంగా మారింది.

* పెనమలూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంగూరు మరికొన్ని వాటిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

* మేజర్‌ పంచాయతీల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. కంచికచర్ల, మైలవరం, గుంటుపల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న పంచాయతీల్లో ఈ పరిస్థితి ఉంది. గుర్తులు కేటాయించిన వెంటనే ప్రచారం ముమ్మరం కానుంది.

* మైలవరంలో కందులపాడు, వెంకటాపురం, సీతారాంపురంతండా ఏకగ్రీవం అయ్యాయి. తెదేపా సానుభూతిపరులను బరిలో నిలపాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సున్నంపాడు, చిన నందిగామ పంచాయతీలలో చర్చలు జరుగుతున్నాయి. కందులపాడులో ఒక మహిళ తనను నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

* వత్సవాయి మండలంలో నాలుగు గ్రామాలలో నియోజకవర్గ స్థాయి నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. గ్రామస్థాయి నేతలు ఒక అంగీకారం వచ్చినట్లు చెబుతున్నారు. తెదేపా నుంచి మాత్రం పోటీలో ఉండాలని తమ సానుభూతిపరులకు సూచిస్తున్నారు. పెనుగంచిప్రోలులో రెండు గ్రామాల్లో ఏకగ్రీవాలు జరిగేందుకు రంగం సిద్ధమైంది. భీమవరం, సుబ్బాయిగూడెం, సింగవరంలో అధికార పార్టీలోనే ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు. నియోజకవర్గ నాయకత్వం ఏకగ్రీవం చేయాలని ఆదేశిస్తే స్థానికంగా వారే పోటీపడుతున్నారు. జగ్గయ్యపేటలోనూ నాలుగైదు పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఈ - వాచ్‌ యాప్‌.. ఆవిష్కరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.