పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ స్పష్టం చేశారు. విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన...ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించి జర్నలిస్టుల సమస్యలు తెలుసుకున్నానన్నారు. విడతల వారీగా పాత్రికేయులకు ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. కొత్తగా పాత్రికేయ వృత్తిలోకి రావాలనుకునే వారి కోసం విశ్వవిద్యాలయాలతో ప్రెస్ అకాడమీ ఒప్పందం చేసుకుంటోందన్నారు. జర్నలిజం కోర్సుల్లో ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామని దేవిరెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీలు నిర్ధరించిన ఫీజుల్లో 40 నుంచి 50 శాతం అకాడమీ తరపున చెల్లించేందుకు సిద్ధమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల సంక్షేమం కోసం ఆలోచన చేస్తోందని తెలిపారు. కొవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకే ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఈ సమావేశంలో అకాడమీ కార్యదర్శి ఎం. బాల గంగాధర్ తిలక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి