ETV Bharat / city

సిద్ధమవుతున్న బ్యాలెట్‌ బాక్సులు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

పార్టీ రహిత ఎన్నికలు.. అయినా బుజ్జగింపులు.. సర్దుబాట్లు.. కాళ్లబేరాలు తప్పడం లేదు.. ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలకు సొంత పార్టీల్లోనే కుమ్ములాటలు దిమ్మ తిరుగుతున్నాయి. ఏకగ్రీవం కాదు కదా.. అభ్యర్థి ఎంపిక పెద్ద సమస్యగా మారింది. తొలివిడత జరిగే ఎన్నికల్లో గురువారం నాటితో ఉపసంహరణ గడువు ముగుస్తుంది. కేవలం ఒక్క రోజే ఉంది. గురువారం అభ్యర్థుల తుది జాబితా తయారు చేసి గుర్తులు కేటాయించనున్నారు. అయితే పలు ప్రాంతాల్లో అధికార పక్షానికి రెబల్‌ అభ్యర్థుల బెడద పొంచి ఉంది. వారిని ఎలా ఉపసంహరింప చేయాలనేది వారికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

సిద్ధమవుతున్న బ్యాలెట్‌ బాక్సులు
సిద్ధమవుతున్న బ్యాలెట్‌ బాక్సులు
author img

By

Published : Feb 4, 2021, 2:23 PM IST

కృష్ణాజిల్లా నియోజకవర్గాల్లో ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం చేసి పట్టు నిలుపుకోవాలని అధిష్ఠానం నుంచి వారికి ఆదేశాలు అందినట్లు వైకాపా శ్రేణులు చెబుతున్నాయి. దీనికిగాను నియోజకవర్గ స్థాయి పరిశీలన కమిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన కమిటీలు తమ పార్టీలో అభ్యర్థులను ఎంపిక చేయడమే కాకుండా గ్రామస్థులతో సంప్రదింపులు జరపాలి. ప్రత్యర్థులను పోటీ నుంచి ఉపసంహరింపజేసి ఏకగ్రీవం చేయడం వారి బాధ్యత. చర్చలు, సంప్రదింపుల ద్వారా చేయడానికి గత రెండు రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరహాలో కొన్ని పంచాయతీల్లో ఫలితాలు వచ్చాయి. ఇప్పటికి తొలి విడతలో 4 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. సుమారు 40 వార్డులు సింగిల్‌ నామినేషన్‌ దాఖలు అయ్యాయి. మొత్తం మీద చూస్తే ఇవి నామమాత్రంగానే భావిస్తున్నారు. మరికొన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు నందిగామలో ఒక పంచాయతీ, మైలవరంలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్ని ప్రతిపక్షం దక్కించుకునేందుకు చర్చలు సాగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే.. గ్రామాల్లో తమ పార్టీ సానుభూతిపరులు ఒక్కరే ఉండేందుకు వైకాపా ఆపసోపాలు పడుతోంది. వైకాపా సానుభూతిపరులుగా పలువురు నామినేషన్‌ దాఖలు చేశారు. తాము ఉపసంహరించుకునేది లేదని భీష్మించినట్లు తెలిసింది.
నేతలకే ప్రతిష్ఠాత్మకం..!
తొలి పోరులో నేతలకే ప్రతిష్ఠాత్మకంగా మారింది. జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, నందిగామలో ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, ఆయన సోదరుడు అరుణ్‌కుమార్‌, మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌, గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీ, పెనమలూరులో పార్థసారథిలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అవి పార్టీ సహితంగా జరిగే ఎన్నికలు కావడంతో పంచాయతీల్లో సత్తా చాటి అధినేత మెప్పు పొందాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రధానంగా ఏకగ్రీవాలు కాని పక్షంలో గెలుపుపై దృష్టి పెట్టారు. గ్రామస్థాయి పథకాల తీరు ఈ ఫలితాలకు దర్పణంగా ఉంటాయని వైకాపా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో వర్గపోరు, బహు నామినేషన్లపై తర్జనభర్జనలు పడుతున్నారు.
గ్రామ స్థాయి పోరు..!
వైకాపాలో గ్రామ స్థాయిలో ఉన్న వర్గపోరు ఇప్పుడు సమస్యగా మారింది. పలు గ్రామాల్లో ఇద్దరు ముగ్గురు చొప్పున సర్పంచి పదవులకు నామపత్రాలు దాఖలు చేశారు. జనరల్‌ పంచాయతీల్లో ఈ పోరు ఇంకా ఎక్కువగా ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 20 పంచాయతీల్లో వైకాపాలో ఇద్దరు చొప్పున పోటీ పడుతున్నారు. ఇక్కడ పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటే లబ్ధి ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నారు. పోటీ అభ్యర్థులు ఉపసంహరణకు కసరత్తులు సాగుతున్నాయి. ‘సొంత పార్టీలోనే సర్ధి చెప్పలేకపోతున్నాం. ఇక ఏకగ్రీవాలు ఎక్కడ ప్రయత్నం చేస్తాం..’ అంటూ ఓ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికి ఆరు పంచాయతీల్లో ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రత్యర్థులతో చర్చలు జరుగుతున్నాయి. నందిగామ నియోజకవర్గంలోనూ పోటీ ఎక్కువగా ఉంది. చాలా పంచాయతీల్లో వైకాపా అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటూ నామినేషన్లను దాఖలు చేసుకున్నారు. తమకే మద్దతు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ సర్దుబాటు కష్టంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో 3 పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్న వైకాపా మిగిలిన పంచాయతీల్లో పోటీలోనే కొనసాగుతోంది. అభ్యర్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ పోరు ఎక్కువగా ఉంది. ప్రధానంగా 9 పంచాయతీల్లోనే వైకాపాలోనే రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. పంచాయితీలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే వంశీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇతర నేతలు జోక్యం చేసుకోవడం లేదు. కానీ అనుచరులు మాత్రం నామపత్రాలు దాఖలు చేసి తామే అసలైన వైకాపా అభ్యర్థులమని ప్రచారం చేస్తున్నారు. నున్నలో, రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు పంచాయతీల్లో వైకాపాలో రెబల్‌ కొనసాగుతోంది. పెనమలూరులోనూ ఇద్దరేసి చొప్పున నామినేషన్‌లు దాఖలు చేశారు. గురువారం వీటిని ఉపసంహరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి సర్దుబాటు జరుగనున్నాయని తెలిసింది.

ఇదీ చదవండి:

ఎన్నికల వరకే ఈ సమస్యలు.. తర్వాత అంతా ఒకటే: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.