Power Holiday Affect: విజయవాడ పారిశ్రామికవాడలో పవర్ హాలిడే ప్రభావం.. ఆందోళనలో వ్యాపారులు - Power Holiday Affect in vijayawada industrial estate
Power Holiday Affect: ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడే విజయవాడ పారిశ్రామికవాడలో.. తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరం, నగర పరిసరాల్లోని వ్యాపార వర్గాలకు.. ఒకే రోజు కాకుండా మూడు రోజుల్లో పవర్ హాలిడే ప్రకటించటం వల్ల.. వారాంతపు సెలవు కూడా కలుపుకుని మొత్తంగా నాలుగు రోజులు పనిలేకుండా నష్టపోతున్నామని చిరువ్యాపారులు, కార్మికులు లబోదిబోమంటున్నారు. వారంలో నాలుగు రోజులు వ్యాపారం దెబ్బతిన్నట్లేనని వాపోతున్నారు. ఇప్పటికే కరోనాతో కుదేలైపోయిన చిన్నపరిశ్రమలపై పవర్ హాలిడే ప్రభావం మరింతగా దెబ్బతీస్తోందంటున్న విజయవాడ వ్యాపార, కార్మికసంఘాలతో.. ఈటీవీ భారత్ ముఖాముఖి..