ETV Bharat / city

Power employees JAC meeting: సమస్యలు పరిష్కరించమంటే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.. - Power employees jac meeting in vijayawada

Power employees JAC meeting: తమ సమస్యలను పరిష్కరించమని కోరితే.. కేసులు, విచారణలు, ఎఫ్‌ఐఆర్‌ల పేరితో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఆవేదన చెందారు.విజయవాడలో నిర్వహించిన ఐకాస సమావేశంలో.. తాజా పరిణామాలపై వారు చర్చించారు. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Power employees jac meeting in vijayawada
సమస్యలు పరిష్కరించమంటే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: విద్యుత్ ఉద్యోగుల ఐకాస
author img

By

Published : Dec 20, 2021, 8:19 AM IST

Power employees JAC meeting: సమస్యలు పరిష్కరించాలని కోరితే.. కేసులు, విచారణలు, ఎఫ్‌ఐఆర్‌ల పేరితో తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస నేతలు ఆవేదన చెందారు. ఇంధనశాఖ మంత్రి సమక్షంలో.. యాజమాన్యం అంగీకరించిన సమస్యల అమలు కోసం.. 31 సంఘాలతో ఏర్పడిన ఐకాస విజ్ఞప్తి చేశామన్నారు.

విజయవాడలో నిర్వహించిన ఐకాస సమావేశంలో.. తాజా పరిణామాలపై వారు చర్చించారు. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త సేవా నిబంధనలను డిస్కమ్‌లో రూపొందించడాన్ని విరమించుకోవాలని.. ఉద్యోగుల తొలగింపు చర్యలు విడనాడాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేస్తామని.. విద్యుత్ శాఖ మంత్రి ఈ ఏడాది జూన్‌ 14న ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఏపీపీడీసీఎల్, ఏపీ జెన్​కోకు చెందిన ఎస్​డీఎస్​టీపీఎస్(SDSTPS) ప్రాజెక్టు ప్రైవేటీకరణ, సేల్‌అవుట్‌తో పాటు హైడల్‌ ప్రాజెక్టులను అప్పగించడం వంటివి.. ఉపసంహరించుకోవాలని కోరారు.

విద్యుత్తు సరవణ బిల్లు.. 2021కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు రంగ బకాయిలు చెల్లించాలన్నారు. రెండేళ్లుగా బహిరంగ మార్కెట్‌ నుంచి విద్యుత్తు సేకరణను అధ్యయనం చేయడానికి.. వినియోగదారులకు, ఉద్యోగులకు వాస్తవాలను తెలియజేయడానికి ఉన్నతస్థాయి స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

Telangana letter to KRMB: 'ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మాత్రమే చేశాం.. ఆయకట్టు పెంచలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.