రైతు భరోసాను ఉద్దేశించి.. జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పథకాన్ని రైతు వంచనగా అభివర్ణించారు. మేనిఫెస్టోలో చెప్పినదానికి ఎక్కువగా కాదు.. రైతులను తక్కువ చేసి వైకాపా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి, ఏపీ భవిష్యత్తు కోసం భూములిచ్చిన పాపానికి.. అమరావతి రైతులపై అనేక అవాస్తవాలు, అపోహలు సృష్టిస్తోందని ఆరోపించారు. 30 వేల మంది రైతులకు అన్యాయం చేసిన సీఎం జగన్.. రైతుల ద్రోహి కాదా అని నిలదీశారు.
ఇదీ చదవండి: ఇసుక తుపాను బీభత్సం- ఐదుగురు మృతి
అకాల వర్షాలు, నివర్ తుపాన్ వల్ల 2020లో నష్టపోయిన రైతాంగాన్ని గాలికి వదిలేసి.. ముఖం చాటేసి, మొండి చేతులు చూపించింది వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని మహేష్ ప్రశ్నించారు. ప్రతి రైతుకు ఎకరానికి రూ.35 వేల నష్టపరిహారం చెల్లించాలని.. రాలిన పంటలను, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. కేవలం రూ. 2,000 ఇన్పుట్ సబ్సిడీ అందజేసి జగన్ సర్కార్ చేతులు దులుపుకొందని విమర్శించారు. ఉచిత విద్యుత్‌కు మంగళం పాడి, మోటార్లకు మీటర్లు బిగిస్తున్న ఈ ప్రభుత్వం.. తడి గుడ్డతో రైతుల గొంతు కొయ్యాలని చూస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: