POSTAL HOUSING LOAN: అతి తక్కువ సమయంలో.. బ్యాంకుల చుట్టూ తిరగకుండా గృహ రుణాలు మంజూరు చేసేందుకు తపాలా శాఖ ముందుకు వచ్చింది. కేంద్రప్రభుత్వం వందశాతం మూలధనంతో తెచ్చిన పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా ఈ సదుపాయం కల్పిస్తోంది. ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులతో పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకుని సేవలను అందిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను ఒక్కో బ్యాంకుతో ఒప్పందంతో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లాను ఫైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని...... హోం ఫస్ట్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా రుణాలు ఇప్పిస్తోంది.
పోస్టల్ శాఖ ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో తమ సేవలను అందిస్తోంది. ఆ శాఖకు చెందిన సిబ్బంది ద్వారా ప్రజలకు.... గృహ రుణాల గురించి వివరించి త్వరిగతిన రుణాలను మంజూరు చేయటం, నెలనెల వారి ద్వారానే తీసుకున్న రుణాలకు చెల్లింపులు చేయవచ్చు. పలు బ్యాంకింగ్ గృహ రుణ సంస్థలు తపాలా శాఖతో ఒప్పందం కుదర్చుకుంటున్నాయి. బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా, తక్కువ సమయంలో గృహరుణాలు మంజూరు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా విస్తృత సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పలు రికార్డులను నెలకొల్పిందన్నారు. పల్లెల్లోని వారు వాహన ఇన్సూరెన్స్‌కు ఎక్కడి వెళ్లకుండానే పోస్టల్ సిబ్బంది ద్వారా చేయిస్తున్నామని వెల్లడించారు. గృహ రుణాలు కావాలన్నా, నగదు బదిలీ అయినా, ఇన్సురెన్స్ పాలసీలైన కేవలం గ్రామంలోని పోస్టాపీసుకు వెళ్తేచాలని ఐపీపీబీ సీనియర్ మేనేజర్ ప్రశాంతి తెలిపారు.
ఇదీ చదవండి: NTR STATUE IN DURGI : అందరూ చూస్తుండగా.. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి!