విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి ఆది, సోమవారాల్లో తుమ్మపల్లి కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. ప్రతీ ఉద్యోగి ఓటింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కోరారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతీ ఉద్యోగి సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని ఆయన కోరారు. 10వ తేదీన నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగనుండగా, ఉద్యోగుల కోసం 2 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌ను ఒకేచోట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నందుకు ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి
రేపు, ఎల్లుండి ఉద్యోగుల కోసం 'పోస్టల్ బ్యాలెట్' - ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
ఉద్యోగుల కోసం ఆది, సోమవారాల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి ఉద్యోగి ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కోరారు.