ETV Bharat / city

Petro-Effect: పేదోడి నడ్డి విరుస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు - petrol price effect

పెట్రోల్, డీజిల్ ధరల దెబ్బకు ఎన్నో జీవితాలు తలకిందులు అవుతున్నాయి. రవాణ రంగమైతే ఎప్పుడూ చూడనంత సంక్షోభం ఎదుర్కొంటోంది. గతంలో ఉన్నట్లు సబ్సిడీల మాట దేవుడు ఎరుగు రెండేళ్లలో దాదాపు 42% పెరిగిన చమురువాతలతో ఆర్ధికభారం పెరగడమే కాదు ఆకలికేకలూ తీవ్రం అవుతున్నాయి. ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయం. కరోనా కష్టాల నుంచే బయటపడని లారీ ఓనర్లు. పెట్రో ధరాఘాతంతో వాహనాలు అమ్మకానికి పెడుతున్నారు. బయట మార్కెట్‌కు వెళ్లి ఏ వస్తువు కొందామన్న నిన్న ఉన్న ధర ఈ రోజు ఉండడం లేదు. బహుశా దేశ చరిత్రలోనే ఇంధన ధరలు ఇంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఇదే మొదటిసారి. అయినా తెలుగురాష్ట్రాల్లో పన్నులు ఎందుకు తగ్గించడం లేదన్నది చాలామంది నుంచి వస్తోన్న ప్రశ్న.

పేదోడి నడ్డి విరుస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

author img

By

Published : Nov 18, 2021, 7:31 PM IST

పేదోడి నడ్డి విరుస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

సముద్రం మీదే ఆధారపడిన మత్స్యకారుల నుంచి ఏ రోజుకారోజు జీవనపోరాటం చేసే ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల వరకు. ఒక మోస్తరు సరకు రవాణా చేసే ట్రక్‌ ఆటోల నుంచి నేషనల్‌ పర్మిట్‌ పెద్దపెద్ద లారీల వరకు..ఎవర్ని కదిపిన కథలుకథలుగా చెబుతారు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు చేస్తున్న గాయాల గురించి. ఈ నేపథ్యంలోనే పెట్రోలు, డీజిల్‌ పన్ను విధానాన్ని అన్ని రాష్ట్రాలు ఒకే తీరుగా వసూలు చేయాలని కేంద్రానికి ఎంతోమంది నిపుణులు, వ్యాపార వర్గాల నుంచి వినతులు అందుతున్నాయి. వేర్వేరు రాష్ట్రాలు వేర్వేరు శాతాల్లో వ్యాట్‌ వసూలు చేస్తున్న తీరుతోనే ప్రజలపై అధిక భారం పడుతోందనే ఆవేదనలే అందుకు కారణం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించినా మేం మాత్రం తగ్గించలేమంటున్న రాష్ట్రాల తీరు ఆ చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.

సుంకం తగ్గించిన ప్రభావం అంతంతే!

పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకంలో కొంత తగ్గించినా..ఆ ప్రభావం వాహనదారు లపై పూర్తిస్థాయిలో కనిపించక పోవడానికి ప్రధాన కారణం రాష్ట్రాల వ్యాట్‌లే. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌ విపణిలో ముడి చమురు 159లీటర్లు సామర్థ్యం కలిగిన బ్యారెల్‌ ధర రూ.6,070గా ఉంది. అంటే లీటరు ముడి చమురు రూ.38.17లుగా ఉంది. దీనిని పెట్రోల్‌ ప్రాసెసింగ్‌ చేసేందుకు, ప్రైట్‌ ఛార్జీలు అన్నీ కలుపుకుంటే రూ.8.88లు, పెట్రోల్‌ డీలర్‌ కమిషన్‌ రూ.3.80లు కాగా మొత్తం 50.85 రూపాయిలు, అదే డీజిల్‌ ప్రాసెసింగ్‌ చేసేందుకు, ప్రైట్‌ ఛార్జీలు అన్నీ కలుపుకుంటే రూ.10.22లు, డీజిల్‌పై డీలర్‌ కమిషన్‌ రూ.2.60లు కాగా మొత్తం 50.99 రూపాయిలు. అంటే పెట్రోల్‌, డీజిల్‌ మూల ధర యాభై రూపాయలకు కొంచం ఎక్కువ.

ఇక్కడ నుంచి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల దోపిడీ మొదలవుతుంది. లీటరు పెట్రోల్‌పై రూ.32.90లు, డీజిల్‌పై రూ.31.80లు లెక్కన ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్‌ సెస్‌లను కేంద్రం విధిస్తోంది. రోజువారీ పెంపు మాటు ఆకాశమే హద్దుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ రావడం, విపక్షాల నుంచి పెద్దగా విమర్శలు రావడంతో కేంద్రం కొంత దిగి వచ్చింది. ఇటీవల పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై పది రూపాయలు తగ్గించింది. తగ్గుదల తరువాత పెట్రోల్‌పై ప్రస్తుతం ఎక్సైజ్‌ సుంకం రూ.27.90, డీజిల్‌ ఎక్సైజ్‌ సుంకం రూ.21.80గా ఉంది. ఇటీవల కేంద్రం పెట్రోల్‌పై విధిస్తున్న రూ.27.90 ఎక్సైజ్‌ సుంకాన్నిఅటు పెట్రోల్‌ మూల ధర రూ.50.85లకు కలిపితే రూ.78.35లు, డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం రూ.21.80లను మూల ధరకు...50.99కి కలిపితే రూ.72.79లకు చేరింది.

ఇక్కడ నుంచి ధరలు..రాష్ట్రాలు విధించే వ్యాట్‌ ఆధారంగా వాహనదారుడికి విక్రయించే ధర ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్‌పై వ్యాట్‌ 35.20 శాతం, డీజిల్‌పై 27శాతం విధిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31% వ్యాట్‌తోపాటు అదనపు వ్యాట్‌ పేరున మరో 4 రూపాయలు వసూలు చేస్తోంది. అలానే లీటరు డీజిల్‌పై 22.5శాతం వ్యాట్‌తోపాటు మరో నాలుగు రూపాయలు అదనపు వ్యాట్‌ రెవెన్యూ కింద వసూలు చేస్తోంది.

ఈ కారణంగానే ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సరి హద్దుల్లో అక్కడితో పోల్చితే మా రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర తక్కువ అన్న బోర్డులు వెలుస్తు న్నాయి. అది చూసైనా ఇక్కడి ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు. విపక్షాలు కూడా ఇదే అంశాన్ని రాజకీయఅస్త్రంగా చేసుకుని విమర్శలు సంధిస్తున్నా సరైన సమాధానాలు కనిపించడం లేదు.

జిఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను అంగీకరించని రాష్ట్రాలు...

జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌ ఉత్పత్తులను తీసుకుని రావడానికీ రాష్ట్రాలు అంగీకరించడం లేదు. దీంతో ధరలు ఇష్టానుసారం పెరుగుతున్నాయి. ఒక్కోరాష్ట్రం ఒక్కోలా వ్యాట్‌ విధిస్తుండడంతో ధరలు కూడా అలానే ఉంటున్నాయి. ఇలా కాక తక్షణమే పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులను జిఎస్టీ పరిధిలోకి తెస్తే వాహనదారులకు భారీగా ఉపశమనం లభిస్తుంది. 5రకాల జిఎస్టీ స్లాబులు ఉన్నా అత్యధికంగా అంటే 28%. ఇవాళ్టి ముడిచమురు ధరల ఆధారంగా తీసుకుంటే పెట్రోల్‌ లీటరు మూల ధర రూ.50.85లు ఉండగా 28శాతం జిఎస్టీ..రూ.14.23లు కలిపితే పెట్రోల్‌ లీటరు ధర రూ.65లకు మించదు. అదేవిధంగా డీజిల్‌ లీటరు మూల ధర రూ.50.99లుకాగా దానిపై 28శాతం జిఎస్టీ రూ.14.27లు కలిపితే లీటరు డీజిల్‌ ధర రూ.65.26కు మించదు.

బ్యారెల్‌ ధర పెరిగినా జిఎస్టీలో మార్పులు ఉండనందున పెద్దగా పెరుగుదల కనిపించదు . పెట్రోల్‌, డీజిల్‌పై విధించే28% జిఎస్టీలో 14% రాష్ట్రానికి, మిగిలిన 14శాతం కేంద్రానికి వస్తుంది. పంపకాల్లోనూ గొడవలు ఉండవు. ఈ మేరకు అంచనా ధరలను పరిశీలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ వ్యాట్‌ పరిధిలోకి తెస్తే ఇప్పుడున్న ధరల్లో సగానికి సగం తగ్గుతాయి.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. మావోలతో సంబంధాలపై ఆరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.