రాష్ట్రం నుంచి కొవిడ్ రోగులను తెలంగాణకు తీసుకెళ్తున్న అంబులెన్స్‌లను.. ఆ రాష్ట్ర పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో బాధితుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. అంబులెన్స్‌ల నిలిపివేతతో ఉద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్ట్ వద్ద అనుమతి పత్రాలు లేని అంబులెన్స్‌లను నిలిపివేశారు.
ఇదీ చదవండి: గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 76మంది మృతి
ప్రభుత్వ విప్ ఉదయభాను, తెదేపా నాయకులు నెట్టెం రఘురాం అక్కడికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు. ఈ-పాస్‌లు ఉంటేనే తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తామని వారు తేల్చిచెప్పారు. అనుమతులు లేని వాహనాలను తిప్పి పంపించేస్తున్నామన్నారు. ఈ ఆంక్షలతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని.. రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు