ETV Bharat / city

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సహాయక చర్యలు - police helps for cyclone victims in chittor

నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు... ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కడప జిల్లాలో నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఐదుగురు మహిళలను, చిత్తూరులో నీటిలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

police helps for cyclone victims in the state
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సహాయక చర్యలు
author img

By

Published : Nov 27, 2020, 9:40 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. కడప జిల్లా పోరుమామిళ్లలో వంతెనపై చిక్కుకున్న ఐదుగురు మహిళ కూలీలను పోలీసులు రక్షించారు. కొట్టాలపల్లి గ్రామం నుంచి గానుగపెంటకు కూలీ పనుల వచ్చిన మహిళలు... తిరుగు ప్రయాణంలో నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. మహిళల కేకలు విని హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు... బాధిత మహిళలను ఒడ్డుకు చేర్చారు. ఐదుగురి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సహాయక చర్యలు

చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఆకుల వారిపల్లికి చెందిన ఆరుగురు నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు మదనపల్లి డీఎస్పీ రవి మనోహర్ ఆచారితో సహా పలువురు పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వారిని క్రేన్ సహాయంతో కాపాడారు.

ఇదీ చదవండి:

పీలేరు రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.