విజయవాడలోని ఆయుర్వేద వైద్యుని ఇంట్లో జరిగిన 50 లక్షల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆసుపత్రిలో పీఆర్వోతో పాటు గతంలో పనిచేసిన వ్యక్తి కలిసి చోరీకి పథకం వేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు ఈ కేసులో 40 మందిని విచారించినట్లు తెలుస్తోంది.
దోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులు తాడేపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని... వారి నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి