ETV Bharat / city

కిడ్నాప్​ కేసులో మరో ముగ్గురి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్​ - police filed custody petition on bowenpally kidnap case

హైదరాబాద్ బోయిన్​పల్లి కిడ్నాప్ కేసులో మరో ముగ్గురు నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కస్టడీ పిటిషన్​పై పోలీసుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.

bowenpally kidnap case
కిడ్నాప్​ కేసులో మరో ముగ్గురి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్​
author img

By

Published : Jan 18, 2021, 7:56 PM IST

ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని హైదరాబాద్ బోయిన్​పల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బాలచెన్నయ్య, మల్లికార్జున్ రెడ్డి, సంపత్​లను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులను ఈ నెల 11న పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

అపహరణలో భాగంగా నిందితులు మియాపూర్​లోని ఓ మొబైల్ దుకాణంలో 6 చరవాణీలు కొనుగోలు చేసి.. వాటితోనే సంభాషణలు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అపహరణ కంటే ముందు ప్రవీణ్​రావు ఇంటి చుట్టూ నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో పురోగతి కోసం నిందితులను ప్రశ్నించాల్సి ఉందని.. కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశముందని పోలీసులు పిటిషన్​లో పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

అఖిలప్రియ బెయిల్ పిటిషన్​ తిరస్కరించిన న్యాయస్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.