ETV Bharat / city

ప్లాస్మా థెరపీపై అవగాహన కల్పించాలి: డీజీపీ

author img

By

Published : Aug 1, 2020, 5:00 PM IST

కరోనా సోకిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ప్లాస్మా థెరపీకి సహకారం అందించి.. ప్రజాసేవలో పోలీసులు భాగస్వాములు అయ్యేలా ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తామని డీజీపీ గౌతంసవాంగ్‌ తెలిపారు. ప్లాస్మా థెరపీతో సానుకూల ఫలితాలు వస్తుంటే, దాన్ని ప్రోత్సహించాలన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై డీజీపీ స్పందించారు.

police department and apollo hospital joint workshop on plasma therapy

ప్లాస్మా థెరపీకి సంబంధించి... నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని డీజీపీ గౌతంసవాంగ్‌ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో పోలీసుశాఖ, అపోలో ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన కొవిడ్‌-19 కార్యశాలకు గౌతంసవాంగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నియంత్రణ కార్యక్రమాల్లో పోలీసులు ముందుండి విపత్కర కాలంలో సేవలందిస్తున్నారని... లాక్‌డౌన్‌ అమలు సమయంలో 45 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉంటూ కరోనా బారినపడ్డారని డీజీపీ తెలిపారు.

అన్‌లాక్‌ 1, 2, 3 అమల్లోకి వచ్చిన తర్వాత 3,200 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని వెల్లడించారు. 1,893 మంది కరోనా నుంచి కోలుకున్నారని... ఇందులో చాలామంది తిరిగి విధులకు హాజరుకావడం సంతోషించాల్సిన విషయమని డీజీపీ అన్నారు. అపోలో ఆసుపత్రి సహకారంతో సిబ్బందిలో అవగాహనకు- వైద్యపరమైన సలహాలకు వారి సేవలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛందంగా తమకు సహకరించేందుకు ముందుకొచ్చిన అపోలో యాజమాన్యాన్ని డీజీపీ అభినందించారు.

ఇదీ చదవండి: కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.