ETV Bharat / city

'రెమ్‌డెసివిర్‌' విక్రయాలపై నిరంతర నిఘా..! - కరోనా వార్తలు

విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో ఓ నర్సు ద్యారా తస్కరించిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా ఒక్కొక్కటి రూ. 30 వేలకు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటువంటి వాటిపై నిరంతరం నిఘా ఉంచుచున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు.

remedisivir black marketers arrested by police
అక్రమ విక్రయాలకు పాల్పడిన నలుగురి అరెస్ట్‌
author img

By

Published : May 19, 2021, 12:16 PM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నిన్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ.. కొందరు స్వార్థపరులు, ఆస్పత్రుల్లో పనిచేస్తున్నవారు మానవతా విలువలు మరిచి మందులను బ్లాక్‌లో విక్రయించాలని చూడడం అమానుషమన్నారు. రోగుల అవసరాన్న సొమ్ముచేసుకునేందుకు.. వాటిని మూడు నుంచి పది రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారని తెలిపారు. ఇలాంటి వారిపై నిరంతర నిఘా ఉంటుందని, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఎవరైనా గుర్తిస్తే వెంటనే సమీపంలోని పోలీస్‌, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

ఒక్కో ఇంజెక్షన్‌ రూ.35 వేలకు..

పోలీస్‌ సోదాల్లో పట్టుబడిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ సంఘటనపై ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో గత పది సంవత్సరాలుగా స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న రుక్మిణిని ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. అదే ఆసుపత్రిలో కొవిడ్‌ విభాగంలో ఏడాది కాలంగా సాయిబాబు పనిచేస్తున్నాడు. అతను ఎవరికి అనుమానం రానీయకుండా ఐదు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను ఒక్కొక్కటి రూ.10 వేల చొప్పున రుక్మిణికి విక్రయించాడు. ఆమె తనకు పరిచయం ఉన్న గోపిరాజు, మోహన్‌రావులకు.. ఒక్కొక్కటి రూ. 25 వేల చొప్పున విక్రయించింది.

మచిలీపట్నంలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఇంజెక్షన్ల అవసరం ఉందని తెలుసుకున్న వారు.. ఒక్కొక్కటి రూ. 30 వేలకు ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నారు. ఎస్పీ నిఘాలో ఈ విషయం వెల్లడికావడంతో సిబ్బంది, చిలకలపూడి స్టేషన్‌ పోలీసులు.. మచిలీపట్నం బైపాస్‌రోడ్‌లో తనిఖీలు నిర్వహించారు. ఒక కారులో ఉన్న నలుగురు వ్యక్తుల వద్ద ఇంజెక్షన్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని, కారును సీజ్‌ చేశారు. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన కూరెళ్ల రుక్మిణి, నూజివీడు మండలం హజరయ్యపేటకు చెందిన సాయిబాబు, వీరులపాడు మండలం వెల్లంకి వాసి పాలపర్తి గోపిరాజు, కంచికచర్ల మండలం ఎస్‌.అమరవరానికి చెందిన మార్కపూడి మోహనరావులపై చిలకలపూడి స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి:

తౌక్టే ధాటికి గుజరాత్​లో 45 మంది మృతి

మోపిదేవి పీహెచ్సీకి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.