ETV Bharat / city

పోలీసుల కొత్త ప్రయత్నం...ఒక్కో రౌడీషీటర్​పై నాలుగంచెల పర్యవేక్షణ

బెజవాడలో రౌడీషీటర్లపై పోలీసుల నిఘా కొరవడింది. దీంతో వారి కార్యకలాపాలు నిరాఘాటంగా సాగుతున్నాయి. వారం వారం వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. పలువురు కౌన్సిలింగ్​కు హాజరుకావటం లేదు . కొందరు పోలీసుల కళ్లుగప్పి దందాలు, హత్యలు చేస్తూనే ఉన్నారు. దీనికి విరుగుడుగా పటమట పోలీసులు కొత్త ప్రయత్నం చేశారు. ఒక్కో రౌడీషీటర్​పై నాలుగంచెల పర్యవేక్షణ ప్రారంభించారు. ఇది నగరం అంతా విస్తరిస్తే ఫలితం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు .

police
పోలీసులు
author img

By

Published : Sep 2, 2021, 9:52 PM IST

విజయవాడ నగరంలో 470 మంది రౌడీషీటర్లు, సుమారు 350 మంది వరకు సస్పెక్ట్‌ షీటర్లు ఉన్నారు. వీరిని వారానికోసారి సంబంధిత స్టేషన్‌కు, టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి పిలిచి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కొవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. తాడేపల్లిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. రౌడీషీట్‌ ఉన్నవారితో పాటు, బ్లేడ్‌ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను కూడా పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. ఏదైనా ఘటన జరిగిన తర్వాత హడావుడి చేయడం కాకుండా.. దీన్ని నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు.

ఇటీవల సంచలనం రేపిన వ్యాపారవేత్త రాహుల్‌ హత్య కేసులో రౌడీషీటర్‌ కోగంటి సత్యం సూత్రధారి అని పోలీసులు తేల్చారు. రెండేళ్ల క్రితం కూడా చాలా నెలల పాటు కోగంటి కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. తర్వాత హైదరాబాద్‌లో జరిగిన రామ్‌ప్రసాద్‌ హత్య కేసులోనూ ప్రమేయం ఉందని తేలిన తర్వాతే పోలీసులు మేల్కొన్నారు. విజయవాడలో రెండు నెలల క్రితం దుర్గ అగ్రహారంలో పట్టపగలు జరిగిన హత్య సంచలనం సృష్టించింది. ఇందులో ప్రధాన నిందితుడిపై సస్పెక్ట్‌ షీట్ ఉంది. క్షేత్రస్థాయిలో నిఘా మరింత పెంచాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు చెబుతున్నాయి.

రౌడీషీటర్ల ఆగడాలను అరికట్టేందుకు పటమట పోలీసులు నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక్కో కానిస్టేబుల్‌కు ఒకరు లేదా ఇద్దరు రౌడీషీటర్లను అనుసంధానం చేశారు. నలుగురు రౌడీషీటర్లపై ఒక హెడ్‌ కానిస్టేబుల్‌, పది మందిపై ఒక ఏఎస్‌ఐకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు సంబంధిత ఎస్‌ఐ.. ఆ సెక్టార్ పరిధిలోని వారిపై నిఘా పెడతారు. ఇలా ఒక్కొక్కరిపై నలుగురి పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. వీరు నిరంతరం రౌడీ, సస్పెక్ట్‌ షీటర్ల కార్యకలాపాలు, కదలికలపై కన్నేసి ఉంచుతున్నారు. స్టేషనుకు వచ్చినప్పుడు వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకోవడం, హాజరు తీసుకోవడంతో పాటు కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. రౌడీషీటర్ల ఆగడాలు అరికట్టేందుకు ఇలాంటి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి

కొండపల్లిలో అక్రమ మైనింగ్‌..చర్యలకు సిద్ధమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.