ETV Bharat / city

విజయవాడలో రెడ్‌జోన్లలో ఆంక్షలు కఠినతరం.. ‌డ్రోన్‌, సీసీ కెమెరాలతో నిఘా - విజయవాడలో కరోనా కేసులు తాజా వార్తలు

ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసు వాహనాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో విజయవాడలో మార్చ్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రెడ్‌జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి,అంతర్గత మార్గాల్లో ప్రజల రవాణాపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడతున్నట్లు చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగేకొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

police and ndrf teams march in vijayawada
పోలీసు వాహనాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో విజయవాడలో మార్చ్‌
author img

By

Published : Apr 27, 2020, 8:01 AM IST

police and ndrf teams march in vijayawada
పోలీసు వాహనాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో విజయవాడలో మార్చ్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘించి ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. రెడ్‌జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలను పర్యవేక్షిస్తాం. అంతర్గత మార్గాల్లో ప్రజల రవాణాపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడతాం. కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగేకొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. బాధ్యతరాహిత్యంగా బయటకు వస్తే 14 రోజులు క్వారంటైన్‌కు తరలిస్తాం’ అని జిల్లా అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం కృష్ణలంక ప్రాంతంలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌, పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసు వాహనాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో మార్చ్‌ నిర్వహించారు.

* ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. ‘విజయవాడ నగర ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసులు నమోదయ్యే ప్రదేశంలో ప్రజలు ఇళ్లలో ఉండకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రజలంతా ఇంట్లో ఉంటేనే సురక్షితం. కేసులు పెరగకుండా ఉండాలంటే సామాజికదూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని, ప్రజలు బాధ్యత మరచి వ్యవహరిస్తే కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండద’న్నారు.

* నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరంలో ఇప్పటి వరకు 150 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రజలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. వైద్యులు, పోలీసులు, గ్రామ వలంటీర్లు/సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది నిర్వహిస్తున్న విధుల్లో ఎలాంటి సంకోచం లేకుండా పని చేస్తున్నారు. వారికి మనం సానుభూతి తెలపడంతో పాటు.. బాసటగా నిలవాలి. నగరంలోని కార్మికనగర్‌లో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి బాధ్యతారాహిత్యంగా బయట తిరగడంతో 20కి పైగా కేసులు నమోదయ్యాయి. కృష్ణలంకకి చెందిన ఒక లారీ డ్రైవర్‌ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తిరిగి రావడం, అనంతరం కాలక్షేపం కోసం ఇంటి చుట్టుపక్కల వారితో కలిసి పేకాట ఆడడంతో 25 మందికి కరోనా సోకింది. అతనిపై కేసు నమోదు చేశామని’ తెలిపారు. ఇకపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్నారు.ఇప్పటి వరకు నగరంలో 6వేల వాహనాలు సీజ్‌ చేశామన్నారు. రెడ్‌జోన్లలో నిత్యం పోలీస్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తామని, ఇప్పటికే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

కరోనా వ్యాప్తి కట్టడికి 'కొవిడ్-19 ఏపీ ఫార్మా' యాప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.