ETV Bharat / city

15 రోజుల్లో మరోసారి భేటీ... పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్ణయం - పోలవరం ప్రాజెక్టు అథారిటీ న్యూస్

పోలవరంలో 41.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు వీలుగా కాఫర్ డ్యాం పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమంలో తేల్చారు. సమావేశంలో పీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్, పోలవరం చీఫ్ ఇంజినీర్, పీపీఏ సభ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

polavaram
polavaram
author img

By

Published : Dec 30, 2020, 12:53 PM IST

Updated : Dec 30, 2020, 2:18 PM IST

విజయవాడలో సమావేశమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ముగిసింది. 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. వీలైనంత త్వరగా కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని తేల్చారు. పోలవరంలో 41.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వకు వీలుగా కాఫర్ డ్యాం నిర్మించనున్నారు. ఆ మేరకే భూసేకరణ, పునరావాస పరిహారం అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ పాల్గొన్నారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్​ఇంజినీర్, పీపీఏ సభ్య కార్యదర్శి రంగారెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

ఇదీ చదవండి: సింగపూర్​లో వ్యాక్సినేషన్​- బ్రిటన్​లో రెండో డోసు

Last Updated : Dec 30, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.