అక్రమ, అవినీతి సంపాదనలో వాటాలు కుదరక, వైకాపా నేతలు వారిలో వారే కుమ్ములాడుకుంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, తప్పుడు పనులకు సహకరించడం లేదని సొంత పార్టీ వారిపైనే కత్తులు దూస్తున్నారని విమర్శించారు. సందీప్, సురేశ్ ల ప్రకటనలు, సెల్ఫీ వీడియోలే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని, ప్రజలను సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వం, చివరకు సొంత పార్టీ వారినే చంపుకొని తినే సర్పజాతిలా తయారైందని మాణిక్య రావు ఆక్షేపించారు.
ఇదీ చదవండి: ట్రంప్‌ను తలుచుకోగానే గుర్తొచ్చే వ్యక్తి.. సీఎం జగన్: పట్టాభి