ఏపీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యాక్ట్ 2020,సెక్షన్ 12ని సవాల్ చేస్తూ హైకోర్టులో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజ్యాంగ అధికారణ 266, 204 ప్రకారం ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేట్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలని పిటిషనర్ కోరారు. పన్నులు, ఇతర ఆదాయాలు కాన్సిడెంట్ ఫండ్‌లో జమ చేయకుండా..కార్పొరేషన్‌కు తరలించటం, విశాఖలోని ఆస్తులను ప్రభుత్వం తనఖా పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
పిటిషనర్ తరుఫున న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా..ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీచదవండి: పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్