ఎస్సీ సామాజిక భవనాల్లో గ్రామ సెక్రటేరియట్ నిర్వహణను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడ మొగల్రాజపురానికి చెందిన ప్రసాద్ ఈ పిల్ దాఖలు చేశారు. మొగల్రాజపురం 7వ డివిజన్లో ఉన్న ఎస్సీ సామాజిక భవనాన్ని ప్రభుత్వం వినియోగించటంపై పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో నుంచి బదలాయించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంపై ఐదు వారాల్లో వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి
CM JAGAN REVIEW: ప్రజారోగ్యంపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి: జగన్