విజయవాడవాసులకు పీటర్ ఇంగ్లండ్ మెన్స్ షోరూం అందుబాటులోకి వచ్చింది. బెంజి సర్కిల్ సమీపంలో గాయత్రి నగర్ వద్ద షోరూంని ప్రముఖ సినీనటి రెజీనా కన్సాండ్రా అట్టహసంగా ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన చేశారు. ఫ్యాషన్ వేర్, ఫుట్‌వేర్ పరిశీలించారు. 7 సంవత్సరాల సినీ జీవితం సంతృప్తి ఇచ్చిందన్నారు. తెలుగుతో పాటు ఇతర భాషలలోనూ నటిస్తున్నానని తెలిపారు. పీవీపీ సంస్థ నిర్మాణంలో నటిస్తున్న తెలుగు చిత్రం ఆగస్టులో విడుదల కానుందని చెప్పారు.
ఇదీ చదవండి: వంటింటి మహారాణులు... నెట్టింట్లో విజేతలు