ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పాలనకు రెఫరెండం: మంత్రి పేర్ని నాని - తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పాలనకు రెఫరెండం తాజా వార్తలు

తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా, భాజపా పార్టీలకు జెండాలు తప్పితే ఎజెండా లేదని మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ 22 నెలల పాలనకు ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా భావిస్తున్నామన్నారు.

perni nani comments on tirupathi by election
తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పాలనకు రెఫరెండం
author img

By

Published : Apr 12, 2021, 7:44 PM IST

సీఎం జగన్ 22 నెలల పాలనకు తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండంగా భావిస్తున్నామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా, భాజపా పార్టీలకు జెండాలు తప్పితే ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, భాజపా నేతలు తిరుపతి ఉప ఎన్నికల్లో విష ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా 5 ఏళ్ల పాలనలో, భాజపా 7 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. వాటికి సమాధానం చెబుతూ..,ఈ ఎన్నికను రెఫరెండంగా అంగీకరిస్తారా? అని సవాల్ చేశారు.

భాజపా నేత సునీల్ దేవధర్ నామాలు పెట్టుకుని రాష్ట్రానికి పంగనామాలు పెడుతున్నారని ఆక్షేపించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజల ఆరోగ్యం కోసం సీఎం తిరుపతి సభకు రాకపోతే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక బాధ్యత లేకుండా మనుషులను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి తెదేపా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగాం: సీఎం జగన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.