ETV Bharat / city

'తెదేపాకు ఓటు వేసేవారులేకే ఎన్నికల బహిష్కరణ' - 'తెదేపాకు ఓటు వేసేవారులేకే ఎన్నికల బహిష్కరణంటోంది'

ఓటమి భయంతోనే తెదేపా ఎన్నికల బహిష్కరణ అంటోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పరిషత్​ ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గాల వారికే పదవులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.

perni nani
తెదేపాకు ఓటు వేసేవారులేకే ఎన్నికల బహిష్కరణ'
author img

By

Published : Apr 2, 2021, 8:44 AM IST

రాష్ట్రంలో తెదేపాకు ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించకపోవడం వల్లనే.. పరిషత్ ఎన్నికల బహిష్కరణ అంటున్నారని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మర్యాద కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారన్నారు. తెదేపా నేతలను ప్రజలు ఇప్పటికే బహిష్కరించారని నాని అన్నారు. నిన్నటి వరకు నిమ్మగడ్డను అడ్డంపెట్టుకుని ఆటలాడిన తెదేపా.. కొత్త అధికారి రాగానే ఎన్నికలు వద్దంటున్నారని ఆరోపించారు. కావాలనే లోకేష్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారని మంత్రి ఆరోపించారు.

తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపాకు భారీ మెజారిటీ వస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. పరిషత్ ఎన్నికల్లో స్థానిక శాసన సభ్యుడి సామాజికవర్గం వారికి ఎంపీపీ పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే పదవులు ఉంటాయని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: 'పరిషత్' ఎన్నికలపై నేడు తెదేపా కీలక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.