విజయవాడ నగరంలోని ఫుట్‌పాత్‌లపై రాత్రి వేళల్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్ ప్రాంతంలో పాదచారుల దారిలో నిరాశ్రయులు నిద్రించి ఉన్న సమయంలో అర్ధరాత్రి తీసిన చిత్రమిది.
గూడుకట్టుకున్న చలి
ఇక్కడ రోడ్డు పక్కన వరుసగా మూటల్లా కనిపస్తున్నవి అభాగ్యుల ఆవాసాలు. ఏ గూడూ లేనివారు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్టాండు పక్కనున్న కూరగాయల మార్కెట్ రోడ్డు మధ్యలో చిన్న చిన్న దోమతెరలు పెట్టుకొని, వాటిని చీరలతో కప్పి లోపల ఇలా తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో ఇలాంటివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎముకలు కొరికే చలిలో రోడ్ల పక్కనే వణుకుతూ అవస్థలు పడుతున్నారు.
అవస్థలే తోడు!
తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. వారికి తోడుగా వచ్చే బంధువులు రాత్రి సమయంలో చలికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఒపెన్ షెల్టరులో చీరలు, దుప్పట్లను రక్షణగా ఏర్పాటు చేసుకుని అవస్థలు పడుతూ ఇలా నిద్రపోతున్నారు. మరోవైపు ఒపెన్ షెల్టరు చిన్నదిగా ఉండటంతో కొంతమంది చలిలో చెట్ల కింద, ఆరుబయట ఉండాల్సి వస్తోంది.
ఇదీ చదవండి: