ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద విజయవాడ ఎంపీ కేశినేని నాని... జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో దాదాపు రూ.37 కోట్ల వ్యయంతో సుమారు 105 కిలోమీటర్ల పొడవు మేర 14 రహదారుల నిర్మాణ పనులను ప్రతిపాదించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎంపీ కేశినేని నాని ఆమోదంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనలు పంపించారు. అతి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేశినేని నానికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండీ... అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత!