ETV Bharat / city

'అద్దె బకాయిలు చెల్లించండి.. ఆ తర్వాతే తరలించండి' - ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యలయం తరలింపు తాజా వార్తలు

విజయవాడ గొల్లపూడిలోని... ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం మంగళగిరికి తరలించే ప్రక్రియను ఆ భవన యజమానులు అడ్డుకున్నారు. 11నెలల అద్దె బకాయి చెల్లించకుండా... రాత్రి సమయాల్లో కార్యాలయాలు తరలించటంపై యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

people intercept the transfer of health commissioner office from gollaprolu to mangalagiri
ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యలయం తరలింపుకు అడ్డంకులు
author img

By

Published : Nov 28, 2020, 10:36 PM IST

విజయవాడ గొల్లపూడిలోని ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యలయం మంగళగిరికి తరలింపును భవన యజమానులు అడ్డుకున్నారు. 11 నెలల అద్దె బకాయి చెల్లించకుండా కార్యలయాలు రాత్రి సమయంలో తరలించటంపై భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం సామాన్లు ప్యాకింగ్ చేయటానికి వచ్చిన వాహనాన్ని అడ్డుకొని వెనక్కి పంపారు.

ముందస్తుగా చెప్పకుండా ఇలా రాత్రి సమయాల్లో ఖాళీ చేయటం భావ్యం కాదని యజమానులు మండిపడ్డారు. తక్కువ అద్దెకు తమ భవనాన్ని ఆరు సంవత్సరాల క్రితం అద్దెకు ఇవ్వగా ఇప్పుడు ఎక్కువ అద్దెకు మంగళగిరికి కార్యాలయం తరలించటంపై భవన యజమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన అద్దె ‌బకాయిలు చెల్లించాలని కోరుతూ నిరసన తెలిపారు.

ఇదీ చదవండి:

ఆధార్ ఆరాటం.. మరిచారు భౌతిక దూరం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.