సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. పన్నుల పేరుతో ఇబ్బందులు పెడుతోందని ప్రజలు (AP PEOPLE ANGRY ON GARBAGE TAX) విమర్శిస్తున్నారు. పురపాలక చట్టంలో మార్పు చేసిన ప్రభుత్వం.. ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను పెంచింది. వీటితో పాటు చెత్తపై కూడా పన్ను కట్టాలని స్పష్టం చేసింది. రోజూ కూలీలు, సామాన్యులకు ఈ పన్నులు భారమవుతున్నాయి.
కొవిడ్ తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఈ తరుణంలో చెత్తపై పన్ను వేయడం ప్రజలకు మరింత భారంగా మారింది. ఉచిత పథకాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి.. ఇప్పుడు పన్నుల పేరుతో దిద్దుబాటు చర్యలు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.
ప్రతీ ఇంటి నుంచి నెలకు రూ.30, హోటళ్ల నుంచి రూ.120 చెత్త పన్ను చెల్లించాలని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. కనీసం మురుగు కాలువలు కూడా సరిగా శుభ్రం చేయకుండా.. పన్నులు వసూలు చేయడం ఏంటని జనం ప్రశ్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. పెంచిన పన్నులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
Central government team in Tirupati: తిరుపతికి కేంద్ర బృందం.. వరద నష్టం వివరాల సేకరణ