తిరుపతి వేదికగా మార్చి 4న జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. సదరన్ జోనల్ కౌన్సిల్‌కు ఏపీ సభ్యుడిగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశిలిచ్చారు.
మరోవైపు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున విభజన అంశాలపై మాట్లాడేందుకు ప్రభుత్వం సలహాదారును నియమించింది. విభజన అంశాలు, ఉద్యోగుల పంపకం తదితర అంశాలను పర్యవేక్షిస్తున్న ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి, విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎల్. ప్రేమ్ చంద్రారెడ్డిని సలహాదారుగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇదీచదవండి