ETV Bharat / city

'ఏపీపీఎస్సీ ఛైర్మన్​ను వెంటనే తొలగించండి'

ఏపీపీఎస్సీ ఛైర్మన్​ ఉదయ్​ భాస్కర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని పీడీఎఫ్​ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఉదయ్​ భాస్కర్​ను వెంటనే తొలగించాలని కోరుతూ పీడీఎఫ్​ ఎమ్మెల్సీల బృందం గవర్నర్​ బిశ్వ భూషణ్ హరిచందన్​కు వినతి పత్రం ఇచ్చారు.

pdf mlcs met governor
'ఏపీపీఎస్సీ ఛైర్మన్​ను వెంటనే తొలగించండి'
author img

By

Published : Dec 2, 2019, 5:13 PM IST

ఏపీపీఎస్సీ ఛైర్మన్​పై గవర్నర్​కు పీడీఎఫ్​ ఎమ్మెల్యేల ఫిర్యాదు
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్​ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ప్రోగ్రెస్సివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఎమ్మెల్సీలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కోరారు. విజయవాడ రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన ఐదుగురు ఎమ్మెల్సీల బృందం ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. గడిచిన నాలుగేళ్లలో ఏపీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు, ముఖాముఖిల్లో అవకతవకలు జరిగాయని గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. బోర్డు నిర్వహించే పోటీ పరీక్షలకు తరచూ సిలబస్ మార్చడం సహా పలు అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయడం సహా నియామక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్​ను కోరారు.

యురేనియం తవ్వకాలపైనా ఫిర్యాదు

రాష్ట్రంలో పలుచోట్ల రహస్యంగా యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని గవర్నర్​కు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. దీని వల్ల ప్రజా జీవనానికి ప్రమాదం కలుగుతోందని.. అటువంటి చర్యలను నిలుపుదల చేయాలని కోరారు. తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీలు తెలిపారు.

ఇదీ చదవండి:

ఆదాయ-వ్యయాలు ఎలా ఉన్నాయి..?: గవర్నర్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.