ETV Bharat / city

Pawan on Aided Schools: ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి: పవన్ - ఎయిడెడ్ విద్యాసంస్థలపై పవన్ వ్యాఖ్యలు

ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ (Pawan on Aided Schools) డిమాండ్ చేశారు. 1982 నాటి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను రద్దు చేయాలి

author img

By

Published : Nov 13, 2021, 8:23 PM IST

ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ (Pawan On Aided Schools) డిమాండ్ చేశారు. తమ బిడ్డలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆ విద్యా సంస్థలు నిర్వహణ సాగేలా చూడాలని తల్లిదండ్రులు రోడ్డెక్కిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతపురం, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం...ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము చదివే కాలేజీలు, స్కూళ్లు ప్రైవేట్ విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని ఆందోళన చేస్తున్నట్లు గుర్తు చేశారు. మెమో ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రభుత్వం ప్రకటన చేసినా.. అందులో మతలబులే కనిపిస్తున్నాయన్నారు. ఆప్షన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పవన్ దుయ్యబట్టారు.

ఎప్పటిలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగాలంటే.. జీవో నెం. 42, 50, 51, 19లను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. 1982 నాటి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

పవన్ పత్రికా ప్రకటన
పవన్ పత్రికా ప్రకటన

ఎయిడెడ్‌ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో

ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు కూడా ఇప్పుడు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర శుక్రవారం మెమో జారీ చేశారు. ఇటీవల సీఎం జగన్‌ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి గతంలో మూడు ఐచ్ఛికాలు ఇవ్వగా.. ఇప్పుడు అంగీకారాన్ని వెనక్కి తీసుకునే ఐచ్ఛికాన్ని కూడా చేర్చారు. పాఠశాల, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకు కలిపి ఈ మెమో ఇచ్చారు.

నాలుగు ఐచ్ఛికాలు.

1. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఆస్తులతో సహా సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలుగా నిర్వహిస్తారు.
2. ఆస్తులు ఇవ్వకుండా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు లిఖిత పూర్వక సమ్మతి తెలిపితే ఆ విద్యా సంస్థలను ప్రైవేటుగా సంస్థలుగా నిర్వహించుకోవాలి.
3. ఎలాంటి సమ్మతీ తెలపకుంటే ప్రస్తుత నిబంధనల మేరకే ఎయిడ్‌ కొనసాగిస్తారు.
4. గతంలో ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యథావిధిగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా నిర్వహించుకోవచ్చు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుంది.

రాష్ట్రంలో 137 ఎయిడెడ్‌ కళాశాలల్లో 124 యాజమాన్యాలు సిబ్బందిని అప్పగించేందుకు సమ్మతి తెలిపాయి. కళాశాలల్లోని సిబ్బందిని అధికారులు ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఇప్పటికే పోస్టింగ్‌లు ఇచ్చేశారు. ఇప్పుడు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సమ్మతిని వెనక్కి తీసుకుంటే సిబ్బందిని ఎలా సర్దుబాటు చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఎయిడెడ్‌ సిబ్బందికి పోస్టులు ఇచ్చేందుకు గతంలో రెగ్యులర్‌ సిబ్బందికి బదిలీలు నిర్వహించారు. అనంతరం ఖాళీల్లో ఎయిడెడ్‌ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు ప్రభుత్వం ఎయిడెడ్‌ సిబ్బందిని వెనక్కి పంపుతామన్నా వారు వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

విశ్వవిద్యాలయాల్లో పోస్టింగ్‌..
పీహెచ్‌డీ అర్హత ఉన్న ఎయిడెడ్‌ అధ్యాపకులకు విశ్వవిద్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సుమారు 342మంది వరకు పీహెచ్‌డీ అర్హత కలిగి ఉన్నారు. వీరిలో 113 మందిని మూడేళ్లపాటు డిప్యూటేషన్‌పై ఆంధ్ర విశ్వవిద్యాలయానికి కేటాయించారు. మిగతా వారిని రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు ఇచ్చారు.

ఇదీ చదవండి

AIDED SCHOOLS: ఎయిడెడ్‌ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.