pawan kalyan: బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ కారణజన్ముడని.. భారత రాజ్యాంగ శిల్పిగా పూజలు అందుకుంటున్న మహనీయుడని పవన్ కొనియాడారు.
-
నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు - JanaSena Chief Shri @PawanKalyan #Ambedkar pic.twitter.com/l2vvuJmzha
— JanaSena Party (@JanaSenaParty) December 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు - JanaSena Chief Shri @PawanKalyan #Ambedkar pic.twitter.com/l2vvuJmzha
— JanaSena Party (@JanaSenaParty) December 6, 2021నిత్య చైతన్యమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు - JanaSena Chief Shri @PawanKalyan #Ambedkar pic.twitter.com/l2vvuJmzha
— JanaSena Party (@JanaSenaParty) December 6, 2021
ఆయన ఆలోచనలు భావితరాలకు అనుసరణీయని పేర్కొన్నారు. అంబేడ్కర్ పట్ల తనకు ఎంతో భక్తి భావం ఉందన్న పవన్.. ఆ భావనే లండన్లో ఆయన నివసించిన గృహాన్ని, లక్నోలో ఆయన స్మారక మందిరాన్ని సందర్శించేలా చేసిందన్నారు. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌరహక్కులు, ఆదేశిక సూత్రాలు నేటికీ, ఏనాటికీ ప్రజలకు రక్షణగానే నిలుస్తుంటాయని అన్నారు.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ నేతలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగంలోని స్ఫూర్తిని పాలకులంతా స్వీకరించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. అందరూ సమానంగా ఎదగాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: