ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రోడ్డు ప్రమాదాల్లో వలస కార్మికులు చనిపోవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరారు. అన్ని రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తేనే వలస కూలీల వెతలు తీరుతాయని అభిప్రాయపడ్డారు.
విపత్కర పరిణామంలో అన్ని వ్యవస్థలూ గాడి తప్పుతున్న తరుణంలో.. ఆర్థికంగా చిన్నపాటి జీవులైన వలస కూలీలపై రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. మా రాష్ట్ర పౌరులు కాదులే అన్న విధంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోకుండా ఉంటే సమస్య పరిష్కారం కాదని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధిలో వలస కార్మికుల చెమట చుక్కల భాగస్వామ్యం ఉందన్న వాస్తవాన్ని విస్మరించకూడదని చెప్పారు.
ఇదీ చదవండి: