అనంతపురం జిల్లాలోని బూదగవి వద్ద.. ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవటం తీవ్రంగా కలచివేసిందని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బళ్లారిలో బిడ్డకు కన్యాదానం చేసి.. స్వగ్రామానికి కారులో వెళుతున్న భాజపా నాయకులు కోకా వెంకటప్ప నాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమన్నారు.
ఒకే కుటుంబంలోని ఐదుగురు మరణించడం మరింత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Anantapur Accident News: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 9 మంది దుర్మరణం