ETV Bharat / city

'ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రతి నాయకుడూ.. బాడుగ నాయకుడే'

author img

By

Published : Jan 25, 2021, 3:06 PM IST

ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని తెదేపా నేత పట్టాభిరామ్‌ విమర్శించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు రాజ్యాంగానికి లోబడి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కొంతమంది మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ వైపు ఉన్నారని విమర్శించారు.

'ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రతి నాయకుడూ.. బాడుగ నాయకుడే'
'ఉద్యోగుల సమస్యలు పట్టని ప్రతి నాయకుడూ.. బాడుగ నాయకుడే'

రాజ్యాంగానికి లోబడి పంచాయతీ ఎన్నికల్లో పనిచేసేందుకు వేలాది మంది ఉద్యోగులు సిద్ధంగా ఉంటే, బాడుగ నేతలు మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ వైపు ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పటాభిరామ్ ఆరోపించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగస్తుల పక్షాన తెదేపా పోరాడుతుందని స్పష్టం చేశారు.

'వేలాదిమంది ఉద్యోగులు బయటకు చెప్పుకోలేక తమ పక్షాన మాట్లాడాలని కోరుకుంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్ విసిరే బిస్కెట్లు కోసం కొందరు బాడుగ నేతలు వెళ్తున్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏ ఉద్యోగికి ఏపీజీపీఎఫ్ నిధులు సక్రమంగా అందట్లేదు. ఈ నిధుల్ని జగన్ ప్రభుత్వం మింగేస్తోందని ఉద్యోగులంతా తీవ్ర వేదనతో ఉంటే బాడుగు నాయకులెవ్వరూ పట్టించుకోవట్లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏపీజీఎల్ఐ ఒక్కటైనా సక్రమంగా పరిష్కారం కాలేదు. పదవీ విరమణ అయిన ఉద్యోగి తనకు దక్కాల్సిన లబ్ధి కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కట్లేదు. సరండెర్ సెలవులకు సంబంధించిన నిధులు కూడా అందించలేని పరిస్థితుల్లో బాడుగ నేతలున్నారా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందో ఉద్యోగ సంఘ నాయకులు అడగరా? 30 నెలలైనా పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. 6 డీఏలు పెండింగ్​లో ఉన్నందుకు సిగ్గుపడాలి. ఎల్టీసీలు కోసం అడుక్కునే పరిస్థితి ఉద్యోగస్తుల్లో ఉంది. ఉద్యోగస్తులకు పీఆర్సీ, డీఏ, ఎల్టీసీలు అక్కర్లేదని నాయకులు భావిస్తున్నారా? ఉద్యోగస్తుల సమస్యలు పట్టించుకోని ప్రతి నాయకుడు బాడుగ నాయకుడే.' పట్టాభి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: వైకాపా ఎంపీలతో సీఎం జగన్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.