ETV Bharat / city

హైదరాబాద్: పెరుగుతున్న మెట్రో ప్రయాణికులు - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాక్​డౌన్​ అనంతరం 30 వేల మంది ప్రయాణికులతో ప్రారంభమైన మెట్రో సర్వీసు... ప్రస్తుతం రోజుకు లక్షా 30 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన క్యాష్ బ్యాక్... ఉచిత ట్రిప్పులతో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది.

passengers increasing in hyderabad metro service
తెలంగాణ:క్రమంగా పెరుగుతున్న మెట్రో ప్రయాణికులు
author img

By

Published : Nov 3, 2020, 6:05 PM IST

హైదరాబాద్​లో... మిగతా ప్రజా రవాణా సాధనాలకంటే మెట్రో సౌకర్యానికే ప్రయాణికులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మెట్రోలో ఎక్కువగా కరోనా నివారణ చర్యలు తీసుకోవడం... మాస్క్ లేకుంటే ప్రయాణికులను అనుమతించకపోవడం వంటి భద్రత చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో రైలులో వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం పాటించేలా చర్యలు తీసుకోవడం.. స్టేషన్​ పరిసరాల్లో శానిటైజేషన్​, థర్మల్​ స్కానర్లు ఏర్పాటు చేసి అనుమతించడం వంటి చర్యలు తీసుకున్నారు. ప్రయాణ సమయంలో రైలులోను, స్టేషన్​లోను కరోనా రక్షణ నిబంధనల గురించి అన్ని భాషల్లో ప్రచారం చేస్తున్నారు.

ఆకట్టుకునే ఆఫర్లతో..

పండుగల సందర్భంగా మెట్రో... ప్రయాణీకులకోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ట్రిప్పుల ప్రకారం, క్యాష్​బ్యాక్​ ఆఫర్లతో ఆకట్టుకుంటోంది. దీనివల్ల ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది.

బస్సు కంటే మెట్రోనే మేలు

వర్షాలు, వరదల వల్ల రహదారులు దుర్భరంగా మారాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్​ నిలిచిపోతూ వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు సమయానికి చేరుకోడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణం సురక్షితంగానూ... వేగవంతంగాను ఉండడం వల్ల మెట్రో ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారు. మెట్రో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.

ఇదీ చూడండి: 'రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకర వైరస్ జగనే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.